తాండూరులో మహద్ఘట్టం..!
– శ్రీరామపురంగా రసూల్‌పూర్
– ఘనంగా నామకరణోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన తాండూరులో మహద్ఘట్టం చోటు చేసుకుంది.

పట్టణ సమీపంలో ఉన్న రసూల్‌పూర్ అభయాంనేయ స్వామి దేవాలయ ప్రాంతం కొత్త గ్రామంగా అవతరించింది. గురువారం రసూల్‌పూర్ గ్రామాన్ని శ్రీరామపురంగా మార్చారు. ఆలయ పండితుల ఆధ్వర్యంలో శ్రీరామపురం నామకరణంకు అంకురార్పణ జరిగింది.

తాండూరు నియోజకవర్గంలో ప్రసిద్ది చెందిన రసూల్‌పూర్‌కు ప్రత్యేకత ఉంది. కాగ్నానది సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం ఉంది. ఏండ్లుగా ఈ ప్రాంతాన్ని రసూల్‌పూర్‌గా పిలుస్తున్నారు. తాజాగా ఈ గ్రామాన్ని శ్రీరామపురంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రసూల్‌పూర్ గ్రామాన్ని శ్రీరామపురంగా నామకరణం చేశారు. దేవాలయ సమీపంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆంజనేయ స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామపురం నామకరణం మహద్ఘట్టంగా నిలిచింది.


