రోడ్డెక్కిన గ్యాస్ సెగ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డెక్కిన గ్యాస్ సెగ..!
– సిలిండర్ డౌన్ పై కన్నెర్ర
– నడిరోడ్డుపై వినియోగదారుల దర్నా
– తాండూరు ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రస్తుతం వంటింట్లో రగులుతున్న గ్యాస్ సెగ రోడ్డెక్కింది. సిలిండర్ల కొరత ఉందని చెప్పడంతో వినియోగదారులు కన్నెర్ర చేశారు.

ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురువారం తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది. బిజీ సమీపంలో ఉన్న అంబా భవాని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు సిలిండర్ల కోసం వచ్చారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు సిలిండర్లు కావాలని బారులు తీరారు. ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల కొరత ఉందని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ సిలిండర్లను తీసుకొని ఫ్లైఓవర్ నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో రోడ్డుపై అటు ఇటు రాకపోకలు స్తంభించిపోయాయి. దారి పొడవునా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు అరగంట పాటు వినియోగదారులు ఆదరణ వ్యక్తం చేశారు. వినియోగదారులకు సిలిండర్లు అందించాలని డిమాండ్ చేశారు. చివరకు నిర్వాహకులు స్పందించి సిలిండర్లు రాగానే అందరికీ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు స్థానికులు నచ్చచెప్పడంతో శాంతించి ఆందోళన విరమించారు. మరోవైపు ఇతర ఏజెన్సీల వద్ద కూడా గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని వినియోగదారులు సిలిండర్లను పొందేందుకు బారులు తీరుతున్నారు.

 

కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..!