బాటసారులకు బాసట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బాటసారులకు బాసట..!
– మండుటెండలో మజ్జిగ పంపిణీ
– 36 రోజులుగా మార్వాడి యువమంచ్ సేవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మండుతున్న ఎండలో బాటసారులకు బాసటన అందించేలా తాండూరు మార్వాడి యువమంచ్ సేవలు అందిస్తోంది.

వేసవి సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ దాహార్తిని తీరుస్తోంది. ప్రతి యేడాది వేసవిలో తాండూరు మార్వాడి యువమంచ్ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సారి కూడా తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 36 రోజులుగా ప్రతి రోజూ మధ్యాహ్నం మజ్జిగను పంపిణీ చేస్తోంది.

తాండూరుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మజ్జిగ కేంద్రానికి వచ్చి మజ్జిగను సేవిస్తూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. ప్రతి రోజూ వెయ్యి మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచ్ జాతీయ ఫోరమ్ సభ్యులు మన్మోహన్ సార్డా, మంచ్ అద్యక్షులు కిషన్ రాఠిలు మాట్లాడుతూ సామాజిక సేవా దృక్ఫథంతో మంచ్‌ కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.

దాతల సహకారంతో ఈ నెల మొత్తం మజ్జిగ కేంద్రం నడిపిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మినరల్ చలివేంద్రాలు కూడా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నడిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మంచ్ కోశాధికారి భరత్ దేవ్డా, జాతీయ కార్యవర్గ సభ్యులు రోహిత్ అగర్వాల్, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు సునీల్ సార్డా, నిహార సోమాని, నితిన్ సార్డా, సభ్యులు పాల్గొన్నారు.

ఇదేం రాక్షస పాలన..!