గల్లంతైన రహమత్‌ డెడ్‌ బాడీ లభ్యం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గల్లంతైన రహమత్‌ డెడ్‌ బాడీ లభ్యం
– రెస్క్యూటీంతో కలిసి వెలికి తీసిన పోలీసులు
– కుటుంబాన్ని పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానదిలో గల్లంతైన రహమత్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

రెస్క్యూ టీంతో కలిసి పోలీసులు డెడ్‌ బాడీని వెలికి తీశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్‌(28), సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్‌ అనే వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానదిలోకి స్నానం చేసేందుకు వెళ్లగా ఇద్దరు గల్లంతయ్యారు.

ఇందులో మోయిజ్ మృతదేహాన్ని వెలికి తీయగా రహమత్ మృతదేహం గల్లంతైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి కావడంతో పోలీసులు గాలింపు చర్యలను నిలిపివేశారు. గురువారం ఉదయం యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, రెస్క్యూ టీంతో కలిసి గాలింపు చర్యలు కొనసాగించారు. నదిలోని లోతులో రహమత్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

మరోవైపు మృతులను చూసేందుకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యుల బందువు సాజిద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. విషాదంలో మరో విషాధం చోటు చేసుకోవడంతో కుటుంబం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది.


పరామర్శించిన బీఎస్‌ఆర్
మరోవైపు కాగ్నానది గల్లంతులో ఇద్దరు మృతి చెందడంతో పాటు బందువు కూడా మరణించిన సంగతి తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పలకరించారు. జరిగిన సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.

విహారయాత్రలో విషాదం..!