ఘనంగా కన్యా పాఠశాల పునః ప్రారంభం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా కన్యా పాఠశాల పునః ప్రారంభం
– పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– పాఠశాల పూర్వ వైభవం కోసం తోడ్పాటుకు కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాల పునఃప్రారంభం ఘనంగా జరిగింది.

గురువారం పాఠశాల పునఃప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్‌రెడ్డి హాజరయ్యారు. వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల కమిటి సభ్యులతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్‌రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కమిటి కృషి చేయాలన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, జుంటుపల్లి వెంకట్, పాఠశాల కరస్పాండెంట్ గోపిచంద్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి