మైసమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు తోడ్పాటు
– రూ.50 వేల విరాళం అందింఇచన బీఎస్ఆర్
యాలాల, దర్శిని ప్రతినిధి : మైసమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాతపనకు తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) తోడ్పాటు అందించారు.

యాలాల మండలంలోని హాజిపూర్ గ్రామంలో నిర్వహించనున్న మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి రూ.50 వేల విరాళం అందించారు.

గురువారం ఆలయ నిర్వాహకులకు ఆర్బీఓఎల్ ప్రతినిధుల ద్వారా ఈ మొత్తాన్ని అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్న బీఎస్ఆర్కు గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా బీఎస్ఆర్ మాట్లాడుతూ.. మైసమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.


