కల్తీ బెల్లం గుట్టు రట్టు..!
– తాండూరుకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ దాడి
– 7,500 కిలోల కల్తీ, కుళ్లిపోయిన బెల్లం స్వాధీనం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలోనీ తాండూరుకు తరలిస్తున్న కల్తీ, కుళ్లిపోయిన వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలోనీ తాండూరుకు తరలిస్తున్న కల్తీ, కుళ్లిపోయిన బెల్లం వ్యవహారం బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ బెల్లం పట్టుబడింది.బెల్లం వ్యవహారం బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ బెల్లం పట్టుబడింది.

టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వార్ పాషా ఆధ్వర్యంలో బోపనారం గ్రామ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తాండూరుకు వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా సుమారు 4 క్వింటాళ్ల కల్తీ, కుళ్లిపోయిన బెల్లం బయటపడింది. ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను పోలీసులు విచారించారు. దీంతో ఆటోలో పట్టుబడిన బెల్లంతో పాటు దుకాణంలో ఉన్న నిల్వను కలిపి మొత్తం 7,500 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బెల్లాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కల్తీ, కుళ్లిపోయిన బెల్లం నిల్వలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వార్ పాషా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ సరుకులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.


