విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
– విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 28వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చైర్ పర్సన్ హాజరై విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు చైర్పర్సన్ విద్యార్థులకు యూనిఫాంలు అందించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం చైర్పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, నాయకులు విద్యార్థులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


