రైతుబంధు వారోత్సవాలు ఆదరహో..!
– ఎండ్ల బండి ర్యాలీలో మంత్రి సబితమ్మ
– పంచకట్టులో ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– అట్టహాసంగా పురవీధుల్లో ఎడ్లబండి, ట్రాక్టర్ల ర్యాలీ
– రైతుబజార్లో ఆకట్టుకున్న రైతుబంధు రంగవల్లిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతుంబంధు వారోత్సవాలు తాండూరులో అదరహో అనిపించాయి.
ఆదివారం టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయశాఖ, మార్కెట్ కమిటి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన వారోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి సబితా రెడ్డి ఎడ్ల బండి ద్వారా పురవీదుల్లో కొనసాగిన ర్యాలీలో పాల్గొన్నారు. విలియమూన్ చౌరస్తా నుంచి ఇందిరా చౌరస్తా, మల్లప్ప మడిగ మీదుగా చించొల్లి రోడ్డు మార్గం నుంచి రైతుబజార్ వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో మంత్రి సబితా రెడ్డి ఆకట్టుకుంటే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రైతు వేషాధారణ పంచెకట్టులో ఆకట్టుకున్నారు.

అదేవిధంగా రైతు బజార్ లో తాండూరు వ్యవసాయశాఖ, తాండూరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వేసిన రంగవల్లికలు మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు నేతలను మైమరిపించాయి. ధాన్యాలతో సీఎం కేసీఆర్ చిత్రపటం, రైతు బంధు పథకం చిత్ర పటం. సంస్కృతిని చాటే బోనాలు, రైతులు సాగు చేసే జొన్న, కుసుమ, వేరు శనగ, శనగ పంటల ప్రదర్శన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

