చెక్కుల పంపిణీ దేశానికే ఆద‌ర్శం

తాండూరు రాజకీయం

చెక్కుల పంపిణీ దేశానికే ఆద‌ర్శం
– పేదింటి పెండ్లిళ్ల‌కు వ‌రం క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్
– వచ్చే రెండేళ్లలో సమస్యలు లేని తాండూరు
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– తాండూరులో 93 మందికి రూ.93.10లక్షల చెక్కుల పంపిణీ
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : కళ్యాణలక్ష్మి, షాధీముభారక్ చెక్కుల పంపిణీ దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైకెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తాండూరు మున్సిపల్, మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 93 మంది లబ్దిదారులకు రూ.93 లక్షల 10 వేల 788ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల పెండ్లిల‌కు ఆర్థిక భరోసా అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకాల ద్వారా ఒక్కో లబ్దిదారులకు రూ.1లక్ష 116లను అందజేస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు దేశమే గర్వించేలా ఈ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. దీంతో పాటు తెలంగాణ సర్కారు రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కూడ కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,081 మంది లబ్ధిదారులకు రూ.30 కోట్ల 33లక్షల 53 వేల 248లను కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద అందజేసిందని తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో తాండూరు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించి సమస్యలు లేని తాండూరుగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ సద్దోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, ఎత్తరి రాములు, సర్పంచులు కుర్వ నాగార్జున, నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కె.గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ వారి, మండల రైతు సమితి కన్వీనర్ రాంలింగారెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మార్కెట్ కవి ఎట్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉపసర్పంచులు హేమంత్ కుమార్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.