జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు
– రెవెన్యూ ఉద్యోగులకు స్థాన చలనం
– జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఉత్తర్వులు జారీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్లకు బదిలీ యోగం కలిగింది. దాదాపు 9 మండలాల్లో తహసీల్దార్లను బదిలీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.నిఖిల బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ల బదిలీలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని కోడంగల్ మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎస్.రవీందర్‌ను నవాబ్‌పేట్ మండల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ బుచ్చయ్యను కోడంగల్ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. బొంరాస్ పేట్ తహసీల్దార్ షహేదా భేగంను దోమ తహసీల్దార్‌గా, దోమ తహసీల్దార్ వహీదా ఖాతూన్‌ను బొంరాస్ పేట్ తహసీల్దార్‌గా నియమించారు. మర్పల్లి మండల తహసీల్దార్ వి.తులసీరాంను దౌల్తాబాద్ మండల తహసీల్దార్‌గా నియమించారు. ఇక్కడ ఇంచార్జ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చాంద్‌పాషను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. మోమిన్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని బంటారం తహసీల్దార్‌గా నియమించారు. అదేవిధంగా పెద్దేముల్ మండల డిప్యూటీ తహసీల్దార్ మోహన్‌ను మర్పల్లి మండలానికి బదిలీ చేసి ఇంచార్జ్ తహసీల్దార్ బాధ్యతలను అప్పగించారు. మర్పల్లి డిప్యూటి తహసీల్దార్ వెంకటచారి బంటారం డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రావును డీసీఎస్ఓకు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌ను కోడంగల్ డిప్యూటి తహసీల్దార్‌గా నియమించారు. కోడంగల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులును తాండూరు ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను పెద్దేముల్ డిప్యూటీ తహీసీల్దార్‌గా బదిలీ చేశారు. నవాబ్‌పేట్ డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌ను కుల్కచెర్ల మండలానికి బదిలీ చేసి ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు.
22 మంది రెవెన్యూ ఉద్యోగులకు స్థాన చలనం
————————————————-
మరోవైపు పలు మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు కూడ స్థాన చలనం కల్పించారు. నవాబ్ పేట్ మండలంలో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తన్న సుదర్శన్‌ను పెద్దేమల్ మండల గిర్దావర్‌గా నియమించారు. వికారబాద్ ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మీని బషీరాబాద్ మండల గిర్దావర్‌గా నియమించారు. జిల్లా కలెక్టరేట్‌గా సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రజిత రాణిని నవాబ్ పేట్ గిర్దావర్‌గా, నవాబ్ పేట్‌గా గిర్దావర్‌గా పనిచేస్తున్న ఖాజామియాను తాండూరు మండల గిర్దావర్‌గా, జిల్లా కలెక్టరేట్‌గా సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌ను దోమ మండల గిర్దావర్‌గా, ధార్‌గా మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దశరథ్ సింగ్‌ను మర్పల్లి మండల గిర్దావర్‌గా, మర్పల్లిలో గిర్దావర్‌గా పనిచేస్తున్న కరుణాకర్‌ను జిల్లా కలెక్టరేట్‌లో సీసీయర్ అసిస్టెంట్‌గా, పెద్దేముల్ మండలంలో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నవీనను ధారూర్ గిర్దావర్‌గా , ధారూర్ గిర్దావర్‌గా పనిచేస్తున్న డి.సుప్రియను మోమిన్ పేట్ గిర్దావర్‌గా, మోమిన్ పేట్ గిర్దావర్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్‌ను జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా, జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ కుమార్‌ను వికారాబాద్ మండల గిర్దావర్‌గా, వికారాబాద్ గిర్దావర్‌గా పనిచేస్తున్న మోహన్‌ను వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి సీనీయర్ అసిస్టెంట్‌గా, జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వివేకానంద్ రావును పూడూరు మండల గిర్దావర్‌గా, పూడూరు గిర్దావర్‌గా పనిచేస్తున్న బాల్‌రాజ్‌ను తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సీనీయర్ అసిస్టెంట్‌గా, తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాకేష్‌ను అదే కార్యాలయంలో గిర్దావర్‌గా నియమించగా జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్. రమేష్‌ను కోట్‌పల్లి గిర్దావర్‌గా కోట్‌పల్లి గిర్దావర్‌గా పనిచేస్తున్న రాంరెడ్డిని జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, జిల్లా కలెక్టరేట్‌గా సీనీయర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుశీల్ సాయికుమార్‌ను నవాబ్ పేట్ గిర్దావర్‌గా, జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బీ.వీరేశంను కుల్కచెర్ల గిర్దావర్‌గా, కోట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని మర్పల్లి గిర్దావర్‌గా, మర్పల్లిలో గిర్దావర్‌గా పనిచేస్తున్న ఎం.బాలమహేశ్వర్‌ను జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా, పరిగిలో గిర్దావర్‌గా పనిచేస్తున్న డి.నరేందర్‌ను జిల్లా కలెక్టరేట్‌లో సీనీయర్ అసిస్టెంట్‌గా స్థాన చలనం కల్పించారు.

