పల్లె పల్లెకు పైలెట్ ముహుర్తం ఖరారు
– 21 నుంచి యాలాల మండలంలో పర్యటన
– ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికారింగా చేపడుతున్న పల్లె పల్లెకు పైలెట్ రెండో విడత కార్యక్రమానికి ముహుర్తం ఖరారయ్యింది. పల్లె పల్లెకు పైలెట్ మొదటి విడత గ్రామాల పర్యటనలో ప్రజలనుండి మంచి స్పందన రావడంతో రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 21వ తేది సోమవారం నుంచి యాలాల మండలంలోని గ్రామాలో ప్రారంభించనున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే వర్గీయులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాలాల జెడ్పీటీసీ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.
21న యాలాల మండలంలో పర్యటన ఇలా
8AM TO 9AM బెన్నూర్ గ్రామంలో అల్పాహారం పూర్తి చేసుకొని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటారు.
9AM TO 10AM జక్కేపల్లి
10AM TO 11AM ముకుందాపూర్
11AM TO 12NOON హాజీపూర్
12NOON TO 1PM కిష్టాపూర్
1PM TO 3PM సంఘం కుర్దు గ్రామంలో ఏర్పాటుచేసిన భోజనం ను పూర్తి చేసుకొని ప్రజల వద్దకు నేరుగా వెళ్లి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుంటారు
3PM TO 4PM యాలాల్
4PM TO 5PM గోరేపల్లి
5PM TO 6PM దేవ్లా నాయక్ తండ
6PM TO 7PM దుబ్బా తండ
7PM TO 8PM దేవనూర్ గ్రామంలో భోజనాన్ని పూర్తిచేసుకుని ప్రజా సమస్యల పై దృష్టి కేంద్రీకరిస్తారు.

