పార్టీ బలోపేతమే అందరి లక్ష్యం
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
– బీజేపీ తాండూరు పట్టణ కమిటి ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో బీజేపీ తాండూరు పట్టణ కమిటిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంతో పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టే విధంగా కలిసికట్టుగా నడుంబిగించాలన్నారు. అనంతరం పట్టణ కమిటీలో స్థానం పొందిన నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు. కౌన్సిలర్ అంతారం లలిత, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ బాలప్ప, సీనియర్ నాయకులు పూజారి పాండు, జగదీష్ యాదవ్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పట్టణ కమిటి ఇదే
బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులగా కోట్ల నరేందర్, దశరత్ మోడి, కల్పన, మంతటి రాజు, వి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శులుగా బొప్పి శ్రీహరి, దోమ కృష్ణ ముదిరాజ్, కార్యదర్శులుగా చిదిరి ప్రకాష్, రాంచందర్, గాండ్ల పరమేష్, శివాజీ రాకూర్, కందనల్లి సంగమేష్, దళితమోర్చ అధ్యక్షులుగా నీరటి రవి, ఓబీసీ మోర్చ అధ్యక్షులుగా నరుకుల భరత్ గౌడ్, కిషాన్ మార్చ అధ్యక్షులుగా ప్రహాల్లాద్ జాదవ్, గిరిజన మార్చ అధ్యక్షులుగా నవీన్ రాథోడ్‌లను ఎన్నుకున్నారు.


