వాట్సాప్‌కే ట్రాఫిక్ చలాన్లు
– పోలీసు శాఖ నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ట్రాఫిక్ చలాన్‌ల విషయంలో పోలీసు శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో నిబంధనలు అతిక్రమించిన వారికి చలాన్ విధింది వాహనదారుడి మొబైల్‌కు మేసేజ్ పంపేవారు. ఇకపై ఆ విధానానికి మెల్లగా స్వస్తి పలకనున్నారు. పోలీసులు నూతన టెక్నాలజీ విధానంతో వాహనదారులకు తమ వెహికల్ కు సంబంధించిన చాలాన్ల అప్ డేట్ నేరుగా వాట్సాప్ కు పంపేందుకు అన్ని చర్యలను సిద్దం చేశారు. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారులు. తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను అందిస్తారు. ఇందులోని మొబైల్ నెంబర్ కు ఈ-చలాన్ వివరాలను పోలీసులు ఇకపై పంపుతారు. సాధారణంగా గతంలో వాహనదారులు ఈ వివరాలు తెలుసుకోవటానికి పోలీసు ఈ-చలాన్ పోర్టల్ లో చెక్ చేసుకోవలసి వచ్చేంది. ఇప్పుడు నేరుగా ఆ వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించారు. దీంతో ఈ చలాన్‌లు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించవచ్చు. ఈ చెల్లింపులను ఆన్ లైన్లో, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ లో, మీ సేవలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. వాహన యజమానులందరికీ ఈ- మెయిల్ ఉండకపోవటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

