బ‌క్రీద్‌ను సంతోషంగా జరుపుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బ‌క్రీద్‌ను సంతోషంగా జరుపుకోవాలి
– ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
– ఈద్గా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ముస్లిం సోద‌రులు బ‌క్రీద్ పండుగ‌ను సంతోషంగా జరుపుకునేందుకు తోడ్పాటు అందిస్తామ‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణం చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌తో క‌లిసి సంద‌ర్శించారు. మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి మైదానంలో జ‌రిపే ప్రార్థ‌నా ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పండుగ బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు కల్పిచేంలా చూస్తామని అన్నారు. బ‌క్రీద్ రోజు ముస్లింకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పండుగ జ‌రుపుకునేలా తోడ్పాటు అందిస్తామ‌న్నారు. అనంతరం తాండూర్ ఆర్డీవో, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్, ఏఈలో ఫోన‌ట్లో మాట్లాడుతూ ఈద్గాలో ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ వెంట పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం పురుషోత్తము, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, ఈద్గా చైర్మన్ యూసుఫ్ ఖాన్, అబ్దుల్ హది షేరి, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌, నాయ‌కులు ష‌ఫి,అన్వర్, అబ్దుల్ ఖవి, జిలానీ, ముస్తాఫ పటేల్, యువకులు తదితరులు ఉన్నారు.