మూడో ముప్పుపై ముందస్తు జాగ్రత్తలు
– జిల్లా ఆసుపత్రిలో పిల్లల కొవిడ్ వార్డు
– సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జునస్వామి
తాండూరు, దర్శిని ప్రతినిది : కరోనా మూడో ముప్పును దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూడో వేవ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 100 మంది చిన్నారుల కోసం ఈ వార్డును ఏర్పాటు చేసి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు. ఎలాంటి ఆందోళన చెందకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
