సీఎం సహాయ నిధితో పేదలకు మేలు
– సర్కారు చొరవతో మెరుగైన వైద్య సేవలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎం సహాయ నిధి పథకంతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన జునేద్ కు సీఎం సహాయ నిధి కింద రూ. 1లక్ష ఎల్‌ఓసీ మంజూరైంది. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లబ్దిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యంతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. ఈ పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

