గణేష్ లడ్డూలకు భలే డిమాండ్
– రూ. 1.68,500లు పలికిన వేలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ లభించింది. మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు వినాయకుల వద్ద లడ్డూల వేలం నిర్వహించారు. ఈసారి గణపతి లడ్డూల వేలంకు మంచి స్పందన లభించింది. సీతారంపేట్ శంకర్‌రావు భగీచలో ప్రతిష్టించిన వినాయకుని చేతిలోని లడ్డును తాండూరు పట్టణ టీఆర్ఎస్ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ రూ. 1లక్ష 68 వేల 500లకు అత్యధిక వేలం పాడి సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 33వ వార్డు కుమార్ షాపింగ్ మాల్ సమీపంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డును తాండూరు శ్రీదేవి ప్రింటర్స్ యజమాని సంతోష్ కుమార్ రూ. 1లక్ష 67 వేల 500లకు దక్కించుకున్నారు.
ఇక మున్సిపల్ పరిధి పాత తాండూరులో ప్రతిష్టింని గణనాథుని చేతిలోని లడ్డును మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు రూ. 1 లక్షకు వేలం పాడి దక్కించుకున్నారు. దీంతో పాటు పట్టణంలోని పలు చోట్ల గణేషుని లడ్డూల వేలం రూ. 1లక్షకు పైగా జరిగింది.
