తండ్రీ, కొడుకుల కోపం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తండ్రీ, కొడుకుల కోపం..!
– చెట్టినాడు చీటింగ్‌ అంటూ నిరసన
– ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్‌పై రైలు అడ్డగింత
– ఉద్యోగమిచ్చి న్యాయం చేయాలని డిమాండ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న చెట్టినాడు సిమెంట్ కర్మాగారంపై ఓ తండ్రి, కొడుకులు కోపం ప్రదర్శించారు. కర్మాగారం రైల్వే ట్రాక్‌ కోసం కోల్పోయిన భూమికి బదులు ఉద్యోగం కల్పించాలని ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్ పై నిరసనకు దిగారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్కాపూర్ గ్రామానికి చెందిన మరాఠి రాజారాం, లక్ష్మణ్‌ రావు కుటుంబాల మద్య వారి తండ్రి గుండప్ప పేరుపై మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామాల మద్య ఉన్న సర్వేనెంబర్ 78లోని 3 ఎకరాల 30 గుంటల భూమిపై వివాదం జరుగుతోంది. ఈ భూమిని 8 ఏండ్ల క్రితం రాజారాం అతని కుమారుడు చిరంజీవిలకు తెలియకుండా లక్ష్మణ్ రావు తన పేరుపై మార్చుకుని పట్టా చేసుకున్నాడు. దీనిపై రాజారాం, చిరంజీవిలు తాండూరు న్యాయస్థానంలో కేసు వేశారు.

ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే 5 ఏండ్ల క్రితం లక్ష్మణ్ రావు కుమారుడు కాశీనాథ్ చెట్టినాడు సిమెంట్ కర్మాగారం రైల్వే ట్రాక్ కోసం విక్రయించాడు. ఇందులో తమకు రావాల్సిన 2.30 ఎకరాల భూమి ఉందని బాధితులు రాజారాం, చిరంజీవిలు తెలిపారు. అయితే భూమి వ్యవహారం కోర్టులో ఉండగానే ఎలా విక్రయిస్తారని గతంలో లక్ష్మణ్ రావును ప్రశ్నిస్తే కర్మాగారంలో కుమారుడు చిరంజీవికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడని రాజారాం తెలిపారు. ఏండ్ల తరబడి సిమెంట్ కర్మాగారం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని రాజారం, చిరంజీవిలు ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయి గురువారం మల్కాపూర్ – సంగెం కలాన్ మార్గంలోని చెట్టినాడు ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్ పై ఎర్ర జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చెట్టినాడు సిమెంట్ కర్మాగారానికి సంబంధించిన గూడ్సు రైలుసు అడ్డుకుని నిరసన చేపట్టారు.

రైలు పట్టాలపై కూర్చుకున్న తండ్రి, కొడుకుల విషయాన్ని రైలు పైలెట్ గమనించి కర్మాగారం యజమాన్యంకు సమాచారం అందించారు. యజమాన్యం వెంటనే కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని తండ్రీ కొడుకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేదిలేదని బాధితులు తేల్చి చెప్పడంతో యజమాన్యం రైల్వే పోలీసులకు సమచారం అందించారు. రైల్వే పోలీసులు తండ్రి రాజారాంను వికారాబాద్ కు తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు కూడా కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage