తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ..!
– కొత్త కమీషనర్ షఫీవుల్లా నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ బదిలీ అయినట్లు తెలిసింది. ఆయన స్థానంలో కొత్త కమీషనర్గా షఫీవుల్లా నియామకం అయినట్లు సమాచారం. ఇక్కడ మున్సిపల్ కమీషనర్‌గా శంకర్ సింగ్ గత ఏప్రిల్ 3వ తేదిన బాధ్యతలు చేపట్టారు. పట్టుమని మూడు నెలలే ఆయన తాండూరు కమీషనర్‌గా పనిచేశారు. అయితే గత కొంత కాలంగా కమీషనర్ శంకర్ సింగ్ పై వివిధ ఆరోపణలు వచ్చాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం, అవినీతి, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, ప్రజావాణిని నిర్వహించకపోవడం, కౌన్సిలర్లకు ఎదురు తిరగడం వంటి విమర్శలు ఉన్నాయి. దీనిపై నేరుగా హెడ్ ఆఫీసుకే ఫిర్యాదులు వెళినట్లు గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన స్థానంలో మెప్మాలో అడిషనల్ పీడీగా పనిచే చేస్తున్న షఫీవుల్లాను విమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, రేపో, ఎల్లుండో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇది కూడా చదవండి…


