ఏఎస్ఎంలను ఆదుకోండి..!
– టీపీసీసీ రేవంత్ రెడ్డికి వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: డిమాండ్ల సాధన కోసం సమ్మే చేస్తున్న ఏఎన్ఎంలను ఆదుకుంటే పూర్తి మద్దతు ఇస్తామని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు అన్నారు. గురువారం తాండూరు పర్యటనకు వచ్చిన టీపీసీసీ రేవంత్ రెడ్డిని తాండూరు ఏఎన్ఎంలు కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీహెచ్ఎ(ఫీమేల్) సర్వీసులను తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించడం లేదని, 11వ పీఆర్సీ వేతనం అందించకపోవడంతో పాటు ఇతర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఏఎన్ఎంలను కాంగ్రెస్ తరుపున ఆదుకుంటే పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇందుకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఏఎన్ఎంలు తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంలను డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు వెంకటమ్మ, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కోశాధికారి భారతి, కమిటీ సభ్యులు రోజా, ప్రధాన కార్యదర్శి మల్లమ్మ, సహాయ కార్యదర్శులు పుష్ప తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

