కేంద్ర వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దాం
– అఖిలపక్ష మహాదర్నాను జయప్రదం చేయండి
– పిలుపునిచ్చాన కాంగ్రెస్, టీజేఎస్, సీపీఎం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని తాండూరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, సీపీఎం నాయకులు కె. శ్రీనివాస్‌లు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిత్యవసరాల సరుకుల ధరలతో పాటు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశ పెట్టి రైతును ఇబ్బందులు పెడుతుందన్నారు. ఉద్యోగవకాశాలను కూడ కల్పించకుండా నిరుద్యోగులను వేధిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, సీపీఎం వామపక్ష పార్టీలతో కలిసి మహాదర్నా చేపట్టినట్లు వెల్లడించారు. రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో చేపడుతున్న మహాదర్నాలో అందరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఖయ్యూం, ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యకులు పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
