కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నేతలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నేతలు
– దర్నా కేసు నమోదుతో విచారణ
– కేసులకు భయపడేది లేదన్న నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు సివిల్ జడ్జీ కోర్టులో స్థానిక కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు ఓ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దర్నా నిర్వహించారు. ఈ దర్నాలో పాల్గొన్న ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్, ఎన్ఎస్‌యూఐ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!