తాండూరు ప్రజలకు గుడ్ న్యూస్
– అడిషనల్ కోర్టును మంజూరు చేసిన న్యాయశాఖ
– ప్రజెంట్ కోర్టుకు అప్‌గ్రేడ్ కల్పిస్తూ ఉత్తర్వులు
– పైలెట్ రోహిత్ రెడ్డి కృషి బార్ అసోసియేషన్ హర్షం
తాండూరు. దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో న్యాయపరమై చిక్కులు ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా న్యాయవాదులు, ప్రజలు ఎదురుచూపులకు కళ్లెం వేసింది. తాండూరుకు కొత్త అడిషనల్ కోర్టును మంజూరు చేస్తున్నట్లు శుక్రవారం జీఓ 60ని జారీ చేసింది.
అందులో తాండూరుకు ఆడిషనల్ ఫస్ట్ క్లాస్ కోర్టును మంజూరు చేస్తూనే ప్రస్తుతం ఉన్న జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టును ఉన్నతీకరించి ప్రిన్సిపల్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టుగా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత న్యాయస్థానంతో పాటు అదనపు న్యాయస్థానం కోసం మున్సిఫ్ కోర్టులో కొత్త న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా కొత్త న్యాయమూర్తిని కూడా నియమిస్తారు. ప్రస్తుతం తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఐదు పోలీస్టేషన్లను రెండుగా విభజించి కేసుల విచారణ జరుపుతారు.
అయితే తాండూరులో చాలా కాలంగా పెండింగ్ లో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషి చేశారు. దీంతో న్యాయ శాఖ తాండూరుకు అడిషనల్ కోర్టును మంజూరు చేసింది. తాండూరుకు కొత్త కోర్టు మంజూరు కావడం పట్ట తాండూరు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఇది కూడ చదవండి..

