కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు న్యాయం

టెక్నాలజీ తాండూరు రాజకీయం

కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు న్యాయం
– అధికారంలోకి వస్తే అభ్యున్నతికి కృషి ఏఐసీసీ
– మైనార్టీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గడి
– తాండూరులో మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం
– పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ఏఐసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గడి అన్నారు. గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఇమ్రాన్ ప్రతాప్ గడి తాండూరు ఎమ్మెలె వ్య అభ్యర్థి మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దోచుకుంటున్నారని అన్నారు. వాళ్ల పాలనలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో మోడీ, కేసీఆర్ లను ఇంటికి పంపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. మైనార్టీలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసీ భారీ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. అబ్దుల్ రవూఫ్, సర్దార్ ఖాన్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!