మిస్టరీ.. మర్డర్..!
– అడవిలో కుల్లిన మహిళ మృతదేహం
– వారం క్రితం అదృశ్యమైన మహిళ..?
– ముమ్మర విచారణ చేస్తున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో మిస్టరీ మర్డర్ జరిగింది. అటవి ప్రాంతంలో కుల్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. విశ్వసనీయన సమాచారం మేరకు… తాండూరు పట్టణానికి చెందిన స్వరాభీ(42) అనే మహిళ అడ్డాకూలీగా పనిచేస్తుంది. గత నెల 29న పనికోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంభీకులు ఈనెల 1న తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కిష్టప్ప అనే నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం పెద్దేముల్ మండలం తట్టేపల్లి అడవి ప్రాంతంలో కుల్లిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహం అదృశ్యానికి గురైన స్వరాభిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎవరు.. ఆమెను ఎందుకు హత్య చేశాడు అనే కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా లోతుగా విచారణ చేపడుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు జరిగిన హత్యతో నిందితుడికి ఏమైనా సంబంధం ఉందా..? నిందితుడికి నేరచరిత్ర, గతంలో హత్యా కేసులు ఏమైనా నమోదై ఉన్నాయా అనే విషయాలపై ముమ్మర విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి…

