77కిలోల గంజాయి స్వాదీనం
– భువనేశ్వర్ టు ముంబై రవాణా
– పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
– వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : గుట్టుగా రవాణా చేస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. రూ. 20 లక్షల విలువైన 77 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా ఎక్సైజ్ పోలీసులు, రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ బృందాలు చేసిన తనిఖీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో నలుగురు నిందితులు ముంబైకి వెళుతున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో నలుగురు నిందితుల నుంచి 77 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. దీంతో ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి…

