యాలాల కాంగ్రెస్‌లో కుంపటి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

యాలాల కాంగ్రెస్‌లో కుంపటి..!
– కొత్త నేతల చేరికపై నేతల ఆగ్రహం
– స్వార్థ నాయకులకు చోటు లేదని మండిపాటు
– కేపీఆర్, సిద్రాల చేరికలను వ్యతిరేకించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండల కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజుకున్నట్లుగా తెలుస్తోంది. అదే మండాలనికి చెందిన మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ చేరికలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. బుధవారం మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డీ, మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబ, బీ బ్లాక్ అధ్యక్షులు, చెన్నారం అనిల్ కుమార్, సీనియర్ నాయకులు హన్మంతు, గురురాజ్ జోషి, మహిపాల్ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాచారం అందించకుండా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అండ చూసుకుని పార్టీలో చేరడాన్ని సహించలేమన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ స్వార్థ రాజకీయాలకు పాల్పడే నేతలకు పార్టీలో చోటు ఉండదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ నాయకులపై కేసులు. బెదిరింపులకు పాల్పడిన చరిత్ర ఉందని, అలాంటి నేతల వల్ల కాంగ్రెస్ పార్టీకి, మచ్చలేని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చెడ్డపేరు వస్తుందన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారే మీకు ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అండతో రాజకీయాలు చేస్తామంటే సహించలేది లేదన్నారు.

చీడ లాంటి నేతలు పార్టీలో చేరడాన్ని చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద నేతలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మీ చేరికను ఎవ్వరు అంగీకరించమని, పార్టీ నేతలకు, ఎమ్మెల్యేకు దూరంగా ఉండాలని హితవు పలికారు. పార్టీ అధిష్టానం కూడా నేతలను దూరంగా పెట్టాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపోలు నాగయ్య, గంతల్ మైనుద్దీన్, హైమద్, నాగప్ప, కాసిమ్, బాసిద్, ఆశప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!