మృతునికి కుటుంబానికి బీవీజీ ఫౌండేషన్ చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఓ మృతునికి కుటుంబానికి బీవీజీ ఫౌండేషన్ చేయూతనందించింది. శనివారం మున్సిపల్ పరిధి 5వ వార్డులో ఆహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. స్థానిక టీఆర్ఎస్ యువనాయకులు విజయ్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న బీవీజీ ఫౌండేషన్ వ్యస్థాపకులు, శ్రీ బాలాజీ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ సంపత్‌కుమార్ ఫౌండేషన్ తరుపున ఆర్థిక సహాయం అందజేశారు. అంత్యక్రియల నిమిత్తం అందజేసిన ఈ సహాయాన్ని డాక్టర్ సంపత్‌కుమార్ తరుపున నాయకులు విజయ్ కుమార్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో యువనాయకులు జాఫర్ ఉన్నారు.
