తెలంగాణలో నేడు భారీ వర్షాలు..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్

తెలంగాణలో నేడు భారీ వర్షాలు..!
– ఆ జిల్లాలో కుండ‌పోత‌కు అవ‌కాశం
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వ‌ల్ల నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం అల్ప‌పీడ‌నంగా మార‌వ‌చ్చ‌ని.. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది. రెండు రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఆదివారం ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశముంది. మ‌రోవైపు రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయ‌ని.. నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర్షాలు
ఏపీలో రాబోయే రెండు, మూడు రోజుల్లో సాధరణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.