వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..!
– హస్తం గుర్తుకే ఓటేయండి
– ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– తాండూరు పట్టణంలో జోరుగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయాలని తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగింది.

ఈ ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలను పంచుతూ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిరల్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

