ఇండ్ల‌లోనే సేంద్రీయ ఎరువుల త‌యారి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఇండ్ల‌లోనే సేంద్రీయ ఎరువుల త‌యారి
– హోం కంపోస్టు తయారిపై దృష్టిసారించాలి
– 34వ వార్డులో అవగాహన కల్పించిన అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తడి చెత్త‌, పొడి చెత్త‌తో ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే సేంద్రీయ ఎరువుల‌ను త‌యారు చేయొచ్చ‌ని తాండూరు మున్సిప‌ల్ అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో మున్సిపల్ ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ ఇంటింటా హోం కంపోస్టు తయారిపై అవగాహన కల్పించారు. ఇండ్ల నుంచి సేక‌రించే త‌డి చెత్త‌, పొడి చెత్త‌ను వేరు చేయ‌డంతో పాటు సేంద్రీయ ఎరువుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలిపారు.
హోం కంపోస్టుతో సేంద్రీయ ఎరువును ఎలా తయారు చేయాలో సలహాలు, సూచనలు అందజేశారు. సేంద్రీయ ఎరువులో ఎన్నో లాభాలు ఉన్నాయ‌న్నారు. అంతేకాకుండా హోం కంపోస్టు సేంద్రీయ ఎరువుల‌తో సంప‌ద‌ను ఆర్జించ‌వ‌చ్చ‌న్నారు. హోం కంపోస్టు తయారీపై అందరు దృష్టిసారించాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో తాండూరుకు మంచి ర్యాంకు వచ్చేలా అందరు సహకరించాలని అన్నారు.