కౌంటింగ్ కేంద్రానికి ఈవిఎంలు
– భద్రత మధ్య తరలించిన అధికారులు
– సీల్ వేసిన జీఓ రాజేంద్ర కుమార్ కటారియా
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తాండూరు సెగ్మెంట్ ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. మంగళవారం తాండూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ ఆధ్వర్యంలో మొత్తం 26 సెక్టార్లలో దాదాపు 1400 మంది సిబ్బంది పాల్గొని ఎన్నికలను సజావుగా నిర్వహించారు.
నియోజకవర్గంలోని 277 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ పూర్తయిన తరువాత సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం, వీవి ప్యాట్ లను తాండూరులోని స్ట్రాంగ్లూంకు తీసుకవచ్చారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2-30 గంటల ప్రాంతంలో ఈవీఎం, వీవీ ప్యాట్ లను ప్రతే వ్యక వాహనంలో కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. చేవేళ్ల పరిధి బండారు శ్రీనివాస ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కె చంద్రానికి తరలించారు. బుధవారం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు(జనరల్ అబ్జర్వర్) రాజేంద్ర కుమార్ కటారియా పర్యవేక్షణలో రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినట్లు తాండూరు సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.
ఇదికూడా చదవండి…

