భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ

తాండూరు రాజకీయం వికారాబాద్

భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ
– పురవీదుల్లో ఆకట్టుకున్న శాంతి ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వె డుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉల్ నభి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమాలియా మిలాద్ కమిటి అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీదుల్లో శాంతిర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముస్లిం సొదరులు పెద్ద ఎత్తున పాల్గొని కీర్తనలు ఆలాపించారు. పాత తాండూరుతో పాటు పట్టణంలోని పురవీదుల్లో ర్యాలీ కొనసాగింది.

పుర వీదుల్లో కొ నసాగిన ర్యాలీలో తాండూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అబేద్, సయ్యద్ ఖాజా మోయినోద్దీన్, రహమాన్ లాల, సయ్యద్ షఫీ, రవి, సుధాకర్, సురేష్, జమిలియా మిలాద్ కమిటి ప్రతినిధులు సయ్యత్ అక్తర్ అలీ, మహమ్మద్ తాజోద్దీన్, గౌస్ బాబ, మహమ్మద్ అజ్మీరి, నిజాం షాహీద్ దర్గా అధ్యక్షులు ముజీద్, మత పెద్దలు, ముస్లి సోదరులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు