విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు..!
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో ప్యూర్ ఈవీ షోరూం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వాహనాల వాడకం భవిష్యత్తులో పెరిగే అవకాశం తప్పక ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఆంజనేయ ఆటోమోబైల్స్ ద్వారా ప్యూర్ ఈవీ షోరూం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకులు రోహిత్ వదేరాతో కలిసి ప్రారంభించారు. షోరూంలో అందుబాటులో ఉంచిన ఎలక్ట్రానిక్ బైకును ఎమ్మెల్యే నడిపించి ఉత్సహాం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాలకు అందరు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
క్రమంగా షోరూంలు అందుబాటులోకి రావడంతో వినియోగం పెరుగుతుందన్నారు. భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే మారే అవకాశం ఉండబోవడం ఖాయమన్నారు. అదేవిధంగా ప్యూర్ ఈవీ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తాండూరులో సంస్థ షోరూంను విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ కస్టమర్లకు షోరూం ద్వారా నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆంజనేయ ఆటోమోబైల్స్ నిర్వహకులు శేఖాపురం క్రిష్ణకుమార్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, నాయకులు అంతారం లలిత, వ్యాపారి కట్కం వీరేందర్, కుటుంబ సభ్యులు, నాయకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

