పూజారి కొడుకు బాడీ బిల్డర్..!
– రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు
– సన్మానించిన బీవీజీ అధినేత డా. సంపత్ కుమార్
– అభినందించిన మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయ పూజారి కొడుకు బాడీ బిల్డింగ్ పోటీలో సత్తా చాటాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి అబ్బుపరిచాడు. ప్రతిభ కనబరిచిన యువకుడును తాండూరు కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్‌లు ఘనంగా సన్మానించారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు కోటేశ్వర స్వామి దేవాలయం పూజారి చంద్రశేఖర్ స్వామి కుమారుడు అభిషేక్ స్వామి ఇంటీల రాష్ట్రస్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో 55 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, మ్యాన్ ఫిజిక్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
ఈ సందర్భంగా సోమవారం డా. సంపత్ కుమార్, మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ అభిషేక్ స్వామిని అభినందించి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభిషేక్ స్వామి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, అందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బీవీజీ ఫౌండేషన్ సభ్యులు లింగదలి రవికుమార్, మహేష్ ఠాకూర్, సంజు, కోట్ల రాజ్ కుమార్, నాగు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

