భళా.. మహేందరన్న యువసేన..!
– పదో తరగతి విద్యార్థులకు అన్నదానం
– పరీక్షలు ముగిసేవరకు చేయాలని నిర్ణయం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పరీక్ష రాసి మండు వేసవిలో బయటకు వచ్చే విద్యార్థుల కోసం అన్నదానం చేస్తూ తాండూరు మహేందరన్న యువసేన సభ్యులు ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సోమవారం మహేందరన్న యువసేన అధ్యక్షులు సుదర్శన్ ఆధ్వర్యంలో తాండూరు మండలం కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ పదో తరగతి ప్రారంభం నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడో రోజు హాజరైన విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. పరీక్షలు ముగిసే వరకు అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరిస్తున్న సభ్యులకు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు. మహేందరన్న చేస్తున్న సేవా కార్యక్రమాన్ని పలువులు భళా అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

