కంకటి.. శ్రీనివాసుడి అవినీతి..!
– పట్టణ ప్రగతి నిధుల దుర్వినియోగం
– ఏసీబీ కేసుతో మున్సిపల్ పాత కమీషనర్ భాగోతం
– డీప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ల కుంభకోణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో ఐదేళ్ల క్రితం కమీషనర్ గా పనిచేసిన కంకటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి భాగోతం చర్చనీయాశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పట్టణ ప్రగతి పథకంలో సుమారు రూ. 1 కోటి వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం దూమారం రేపుతోంది.

అప్పటి మున్సిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లతో కలిసి కుమ్మక్కై నిధులు దుర్వినియోగంకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే… 2020వ సంవత్సరంలో ఇక్కడ కమీషనర్ గా కంకటీ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్. ప్రభత్వం పట్టణ ప్రగతి రెండో విడత కింద నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణంలోని 13వ వార్డులో చిలుక వాగులో మరమ్మత్తుల పనులు చేపట్టారు.

ఈ పనులకు సంబంధించి తప్పుడు పత్రాలతో బిల్లులు లె పుకున్నారని ఆ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 20 గంటలు ఇటాచీ ప్రొక్లెనర్ను ఉపయోగించి 144 గంటలు ఉపయోగించినట్లు బిల్లులు లేపుకున్నారని ఆధారాలతో శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అప్పటి డీఈ యూనుస్, ఏఈ గోపాల మహేష్ లు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఇదేవిధంగా పట్టణ ప్రగతి నిధులతో రూ. 1కోటి వరకు దుర్వినియోగంతో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఏసీబీ అధికారులు అప్పటి మున్సిపల్ కమీషనర్ కంకటీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ యూనుస్. ఏఈ గోపాల మహేష్ లపై కేసు నమోదు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత పట్టణ ప్రగతి కుంభకోణంలో అధికారులు భాగోతం బయట పడడం తాండూరులో చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

