బాల‌ల సంక్షేమంపై దృష్టిసారించాలి

తాండూరు

బాల‌ల సంక్షేమంపై దృష్టిసారించాలి
– బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బాల‌ల సంక్షేమంపై దృష్టిసారించాల‌ని తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి 20వ వార్డు బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత అజ‌య్ సింగ్ ఠాకూర్ అన్నారు. గురువారం వార్డులోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న అంగ‌న్‌వాడి కేంద్రంలో బాల‌ల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిన్నారుల మ‌ద్య బాల‌ల దినోత్స‌వాన్ని ఉత్స‌హాంగా జ‌రిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ‌హిళ‌లు గర్భిణీగా ఉన్నప్పటి నుంచి పిల్లలకు మంచి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో అంగ‌న్‌వాడి వ్య‌వ‌స్థ‌ను
ప్రారంభించింద‌న్నారు. ఇక్క‌డే చిన్నారి బాలబాలికలకు విద్య ప్రారంభ‌మవుతుంద‌ని, టీచ‌ర్లు శ్రద్ధగా పిల్లల చ‌దువుల‌ను ప్రోత్స‌హించే చూడాల‌న్నారు. నేటి బాలల‌ను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అంగ‌న్‌వాడి టీచ‌ర్ల‌పై బాధ్యత ఉందన్నారు. బాల‌ల ఆరోగ్యంతో పాటు వారి సంక్షేమంపై దృష్టిసారించాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా చిన్నారి బాల బాలిక‌ల‌కు పోటీలు నిర్వ‌హించారు. ఇందులో ప్ర‌తిభ‌ను చాటిన వారికి కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్ బ‌హుమతుల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్ రాధా, ఆయమ్మ భీమమ్మ‌, ఆర్పీ శోభ, విద్యార్థుల త‌ల్లిదండ్రులు త‌దిత‌రులు పాల్గొన్నారు.