మృతుల కుటుంబాలకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం
– సొంతంగా ఒక్కొక్కరికి రూ.20వేల అందజేత
– హాజీపూర్ పిల్లలను ట్రస్టు నుంచి ఆదుకుంటాం
– ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి బాధాకరం
– కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శని ప్రతినిధి : చేవేళ్ల ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం అందించారు. మూడు రోజుల క్రితం చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరుపున రూ. 5లక్షలు, ఆర్టీసీ సంస్థ తరుపున రూ.2 లక్షలు మొత్తం ఒక్కొ మృతునికి రూ.7లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తన సొంత ఖర్చుల నుంచి ఒక్కొక్కరికి రూ. 20వేల చొప్పున ఆర్థిక చేయూతను అందజేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా, ఖాలిద్, రెండు నెలల చిన్నారితో కలిపి ఆ కుటుంబానికి రూ. 60 వేలు, పట్టణంలోని విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్ కుటుంబానికి రూ.20వేలు, వాల్మీకీనగర్ కు చెందిన వెంకటమ్మ కుటుంబానికి రూ. 20వేలు, పాత తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ కుటుంబానికి రూ. 20వేలు, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం కుటుంబానికి రూ.20వేలు, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిల రెడ్డి కుటుంబానికి రూ. 20వేలు, హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందెప్ప కుటుంబానికి రూ.40వేలు, పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూషా, సాయిప్రియ, నందిని కుటుంబానికి రూ. 60వేలు తన చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు.
kvcs
హాజీపూర్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లను ట్రస్టు తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 13 మంది ఒకేసారి మృతి చెందడం బాధాకరమన్నారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు, ఆర్ధిక సాయాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మరోవైపు తాను మంత్రిగా ఉన్న సమయంలోనే చేవేళ్ల రోడ్డు పనులు మంజూరు కావడం జరిగిందన్నారు. తాండూరు వికారాబాద్ రోడ్డును కూడా సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పనులు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని అన్నారు. ఆయన వెంట టీపీసీసీ ప్రచార కమిటి సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, సీనీయర్ నేతలు సిద్రాల శ్రీనివాస్, గడ్డలి రవిందర్, మాజీ కౌన్సిలర్లు పరిమళ, అబ్దుల్ ఖవి. బిడ్కర్ రఘు, భగవాన్. అగ్గనూర్ సంకేత్, సిద్దు అయ్యా, ఆదమ్ ఖాన్. తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి