బీసీల దైవం బీపీ మండల్
– ఆయన సిఫార్సులను అమలు చేయాలి
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకు కృషి చేసిన బిందేశ్వరి ప్రసాద్(బీపీ) మండల్ బీసీలకు దైవం అని బీసీ సంఘం తాండూరు కన్వినర్ రాజ్ కుమార్ అన్నారు. బుధవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ 103 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ కుమార్‌తో పాటు పలువురు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయం, విద్య, వైద్యం తదితర రంగాలలో వెనుకబాటుకు గురైన బీసీల అభివృద్ధి కోసం బీపీ మండల్ ఎంతో కృషి చేశారన్నారు. మండల్ కమిషన్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని, ఇందుకోసం 40 సిఫార్సులను చేశారని అన్నారు. కాని కేంద్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదన్నారు. బీసీలపై చిత్తశుద్ది ఉంటే బీపీ మండల్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సైయాద్ శుకూర్ బీసీ నాయకుడు రాజు యాదవ్, బస్వరాజ్, బోయ రాధాకృష్ణ, అశోక్ ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, అమ్రేష్ ముదిరాజ్, రమేష్ సింగ్ ఠాకూర్, మతిన్, అజయ్, టైలర్ రమేష్, అశోక్, సమీ, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
