ఏక‌గ్రీవ ఎమ్మెల్సీల‌ను అభినందించిన కేటీఆర్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఏక‌గ్రీవ ఎమ్మెల్సీల‌ను అభినందించిన కేటీఆర్
– కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మ‌హేంద‌ర్‌రెడ్డి, శంబీపూర్ రాజు
ఉమ్మ‌డి రంగారెడ్డి, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్ల ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజుల‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ కొన‌సాగుతోంది. శుక్ర‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజుల‌ను అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజులు రెండోసారి ఎంపిక కావ‌డం ప‌ట్ల మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు అభినంద‌న‌లు తెలిపిన కేటీఆర్‌కు మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.