రేపు తాండూరులో బోనాల జాతర

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో బోనాల జాతర
– ముస్తాబైన కట్ట మైసమ్మ దేవాలయం
– దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజ్ఞాన్‌పుర్ కాలనీ, గుమాస్తా నగర్‌లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో రేపు, ఎల్లుండి బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వార్డు మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆలయ కమిటి సభ్యులు, భక్తబృందం తెలిపింది.

జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జారతలో భాగంగా ఆదివారం రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, మహా మంగళ హారతి, పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాలతో పాటు సాయంత్రం 5గంటలకు బోనాల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సోమవారం రోజు కూడ సుప్రభాత సేవ, అభిషేకం, మహా మంగళహారతి కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం 1 గంటల నుంచి మహా ప్రసాదం(అన్నదానం) వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

వాహనదారులకు గుడ్‌ న్యూస్..!