గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్

తాండూరు రాజకీయం వికారాబాద్

గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్
– కండువా కప్పి ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి
– కాంగ్రెస్‌కు ఒకేరోజు రెండు షాక్‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ పార్టీకి ఒకేరోజు రెండు షాక్‌లు తగిలాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పరిమళ, సీనీయర్ నాయకులు గడ్డలి రవీందర్‌లు సోమవారం ఉదయం బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సాయంత్రం హస్తం పార్టీకి చెందిన మరో మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తాండూరు పట్టణంలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు నివాసంలో ఈ సంఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ వార్డు మాజీ కౌన్సిలర్ బొంబీనా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. పైలెట్ రోహిత్ రెడ్డి బొంబీనాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె కుమారుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నేతలకు మంచి గుర్తింపు ఉంటుందని రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా గుబాలించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

టీజర్, సినిమా రెండూ చూపిస్తా..!