కొత్త వేరియంట్‌పై తెలంగాణ అల‌ర్ట్

ఆరోగ్యం తెలంగాణ

కొత్త వేరియంట్‌పై తెలంగాణ అల‌ర్ట్
– నేడు ఆరోగ్య‌శాఖతో మంత్రి హ‌రీష్ రావు స‌మీక్ష
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కొత్త‌, వేరియంట్, క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ఈ మేర‌కు నేడు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్యం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ కొనసాగింది. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్‌పై మంత్రి హరీష్‌ రావు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అయితే ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని ట్రేసింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.