చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సద్భావనా దివాస్‌గా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహనికి
నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాభివృద్ధికి రాజీవ్ కృషి చేసిన విధానాన్ని కొనియాడారు. పేదల కోసం చేసిన అభివృద్ధితో ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయుగా నిలిచారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, కోర్వార్ నగేష్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, హేమంత్‌కుమార్, నవాజ్, నారా అశోక్, సత్యమూర్తి దొరశెట్టి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, రాము, యువనాయకులు రఘునందర్, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
