కాల్ రికార్డు కోర్టే తేలుస్తుంది..!
– తాండూరులో బజారు రాజకీయాలు తగవు
– మహేంద్రుని మాటలను వక్రీకరించారు
– ఎమ్మెల్సీ అనుచరులే లక్ష్యంగా బెధిరింపు కేసులు
– ఎన్ని కేసులు పెట్టినా బెధిరేది లేదు
– అధికార సమన్వయలోపంతోనే కల్లోలాలు
– మీడియా సమావేశంలో తాండూరు టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఐని దూషించారంటూ, ఎమ్మెల్యే అనుచరులను రౌడీ షీటర్లు సంబోధించారంటూ వచ్చిన కాల్ రికార్డు అంశాన్ని కోర్టే తేలుస్తుందని, సొంత పార్టీలో ఎమ్మెల్యే అనుచరులు బజారుకెక్కి రాజకీయాలు చేయడం తగదని తాండూరు టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ రవిందర్ రెడ్డి, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు సమ్లాళ్ల నర్సింలు, పీఏసిఎస్ చైర్మన్ లు వెంకట్రామ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనియర్ కౌన్సిలర్ నీరజాబాల్‌రెడ్డి, సిద్రాల శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు.
పట్టణంలో జరిగిన భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ఆలయ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయం పాటించకపోవడంతో ప్రోటోకాల్ వివాదం అయ్యిందన్నారు. దీనిపై వివరణ కోరేందుకు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో మాట్లాడిన రికార్డును కొందరు వ్యక్తులు వక్రీకరించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని దీనిని ఖండించారంటూ పేర్కొన్నారు. దీనిపై కోర్టే తెలుస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జాతరలో ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే వెంట వచ్చిన ఒకరిద్దరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీ వాఖ్యలు చేశారని, దీనిని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీపైనే ఎమ్మెల్యే వర్గీయులు బజారులో దర్నాలు, ఆందోళనలు చేయడం మంచిపద్దతి కాదన్నారు. దీనికి పూర్తి బాధ్యత పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిదే అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చైర్ పర్సన్, సర్పంచ్‌లపై ఒత్తిడిలకు గురిచేస్తూ అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. అధికార యంత్రాంగాలు సైతం ఇందుకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎవ్వరెన్ని కుట్రలు చేసినా.. కేసులు పెడతామని బెదిరించినా భయపడేది లేదని, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వెన్నంటే ఉంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా బజారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, సీనియర్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, అజయ్ ప్రసాద్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచులు ప్రియాంక, రుక్కాపూర్ సర్పంచ్, రేగొండి సర్పంచ్ హైదర్, యువనాయకులు బిర్కడ్ రఘు, యాలాలు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


