మృతుని కుటుంబానికి సాయం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుని కుటుంబానికి సాయం
– ఔనత్యం చాటిన చంద్రశేఖర్ గౌడ్‌
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి తాండూరు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయం అందించారు. మండలంలోని సంగంకలాన్ గ్రామానికి చెందిన తుల్జప్ప ఇటీవల రోడ్డు ప్రమాదంలో బైక్‌పై నుంచి పడి గాయాలపాలయ్యారు. ఆయనకు కాలు విరిగిపోవడంతో అదే రోజు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. సోమవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిలు కుటుంబానికి సాయం అందజేశారు. చంద్రశేఖర్ గౌడ్ అంత్యక్రియల నిమిత్తం రూ. 3500ల ఆర్థిక సహాయం కుమారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు కామిని శ్రీనివాస్,.గ్రామ యూత్ అధ్యక్షుడు తిరుమలేశ్, సొలంకర్ రాజు. గైబప్ప, v. రాము, కడ్చికలం రాములు, బెద్గుపల్లి చంద్రప్ప, అనంతమ్మ, బాజరప్ప పాల్గున్నారు.