సీపీఎస్ ను రద్దు చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీపీఎస్ ను రద్దు చేయాలి
– తాండూరు మున్సిపల్ ఉద్యోగుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తాండూరు మున్సిపల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. సీపీఎస్ అంతం మా పంతం అంటూ, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ లు ఆంజనేయులు, నీరటి శ్రీనివాస్, రాములు, నర్మదా, సునీత, అనంతయ్య, బిల్ కలెక్టర్లు నాగేంద్ర, ఆకాష్, దివిటి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!