ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. మహాయజ్ఞంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వకర్మ భగవాన్ ప్రంపచానికి ఆదర్శమన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్ పర్సన్. వీఐ శ్రీనివాస్ చారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు వెంకటేష్ చారి, సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి, సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ చారి, ఉపాధ్యక్షులు రవికుమార్ చారి, కోశాధికారి బాలకృష్ణ చారి, నరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

